GNTR: స్థానిక పారిశుధ్య సమస్యల పరిష్కార చర్యల్లో భాగంగా మంగళగిరి పరిధిలో మిద్దె సెంటర్, మార్కెట్, గాజుల వారి బజార్ రోడ్డులో బుధవారం తెల్లవారు జామున నగరపాలక సంస్థ కమిషనర్ అలీం భాషా ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న రోడ్లు, మురుగు కాలువల పారుదల వంటి అంశాలను పరిశీలించారు. అనంతరం మార్కండేయ కాలనీ గోశాలను తనిఖీ చేశారు.