NLR: బుచ్చి పట్టణంలోని స్థానిక పార్క్ వద్ద మెప్మా ఆధ్వర్యంలో అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఛైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి, కౌన్సిలర్లు మార్కెట్‌ను సందర్శించారు. మహిళలు స్వయంగా చేసిన వస్తువులను ఆహార పదార్థాలను వారు సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధి చేసుకునేలా మెప్మా ఆధ్వర్యంలో అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.