SKLM: పాతపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఫేర్వెల్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. విద్యార్థులకు రూ.20 వేలు బహుమానం అందజేశారు. అనంతరం కళాశాల సిబ్బంది ఎమ్మెల్యేని సన్మానించారు.