సత్యసాయి: పెనుకొండలో అంగన్వాడీ వర్కర్స్ అర్బన్ సెక్టార్ బుధవారం సమావేశం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేశ్, బాబావాలి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్‌కు వడ్డీతో సహా గ్రాట్యూటి చెల్లించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ఐసీడీఎస్‌కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.