AP: దావోస్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయ్యిందంటూ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టాలంటే ఏపీ గుర్తుకు వచ్చేలా సీఎం చంద్రబాబు దావోస్లో వివరించినట్లు తెలిపారు. పారిశ్రామిక వేత్తలు ఏపీకి రావడానికి ఆసక్తితో ఉన్నారని అన్నారు. తక్కువ వ్యవధిలో ఏపీ రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. 6 నెలలలోపే అభివృద్ధి ఫలితాలు ప్రజలకు కనిపిస్తాయని వెల్లడించారు.