BDK: చర్ల మండల సరిహద్దు ప్రాంతమైన బాసగూడ-ఆవపల్లి ప్రధాన రహదారిపై మావోయిస్టులు ఏర్పాటు చేసిన 50 కిలోల ఈఐడీ బాంబును గురువారం సీఆర్పిఎఫ్ పోలీసులు గుర్తించారు. పోలీసులే లక్ష్యంగా ఈఐడీ బాంబును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక బాంబు స్క్వాడ్ ద్వారా బాంబును నిర్వీర్యం చేసి ఘటనపై కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.