MBNR: జిల్లా కేంద్రంలోని షాషాబ్ గుట్ట సయ్యద్ హజర్ షా దర్గలో గురువారం సాయంత్రం నిర్వహించిన గంధోత్సవంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గాలో ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సోదరభావంతో కలిసిమెలిసి పండుగలు, పర్వదినాలు జరుపుకోవాలని సూచించారు.