MDK: రామాయంపేట మండల వ్యాప్తంగా అపార్ నమోదు ప్రక్రియను నిర్వహిస్తున్నామని మండల విద్యా ధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్ర సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం అపార్ రూపొందించిందన్నారు. అపార్ అంటే ఆటోమెటిక్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఇందులో ఒక విద్యార్థికి సంబంధించిన సమగ్ర సమాచారం ఉంటుందని తెలిపారు.