కాకినాడ: రూరల్ మండలం రమణయ్యపేట చేపల మార్కెట్ కూరగాయల కొట్టు వద్ద అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది చూసిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పివేసి అదుపు చేశారు. సకాలంలో స్పందించడంతో ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. ఈరోజు మార్కెట్లో పెద్దగా జనం లేకపోవడం, షాపులు మూసివేసి ఉండడంలో పెను ప్రమాదం తప్పిందన్నారు.