ATP: గుత్తిలో బుధవారం కనుమ (పార్వేట) పండగ సందర్భంగా చికెన్, మటన్ దుకాణాల వద్ద పెద్ద ఎత్తున మాంసం కొనుగోలు కోసం క్యూ కట్టారు. పట్టణంలోని శాంతి ప్రియ హాస్పిటల్స్ సమీపంలో రోడ్డుకు ఇరువైపులా మాంసం దుకాణాల వద్ద జనాలు చికెన్, మటన్ కోసం క్యూ కట్టారు. రోడ్డుపై వాహనాలతో స్వల్ప ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కేజీ మటన్ ధర 650 ఉండగా వంద రూపాయలు పెంచి 750 చేశారు.