KDP: కడప జిల్లా ప్రొద్దుటూరులో వెలసిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయం అమ్మవారి శాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా.. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు హోమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా బంగారు చీరతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.