నెల్లూరు: భోగి సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని గూడూరులోని పలుచోట్ల బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని సాంప్రదాయ పద్ధతుల్లో ప్రతి ఇంట్లో కూడా వీటిని వివిధ రకాల బొమ్మలతో వైభవంగా అలంకరించారు. దూర ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు చేరుకున్న తమ కుటుంబాల వారు ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేయడంపై ఆసక్తి కనబరిచారు.