HYD: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో కూనంనేని మీడియాతో మాట్లాడారు. ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం పేదలకు చెందిన లక్షల దరఖాస్తులు ఏండ్ల తరబడి పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. పేదల ఆశలన్నీ ఎల్ఆర్ఎస్ పైనే ఉన్నాయని వెంటనే పరిష్కరించాలని కోరారు.