HYD: కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో ఆదివాసీ గూడేలు ఆగమయ్యాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అనేక సమస్యల మధ్య ఆదివాసీలు జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం హామీలు ఇవ్వడం, ప్రకటనలు చేయడానికి మాత్రమే పరిమితం కాకుండా తక్షణమే సమస్యలను పరిష్కరించడానికి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పనిచేయాలని డిమాండ్ చేశారు.