AP: టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురంలోని యాడికి వాసులకు వార్నింగ్ ఇచ్చారు. ఆలయ కుంటను కబ్జా చేసిన వారిని వదిలేది లేదని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలను జేసీబీలతో పడగొడతానని చెప్పారు. గత ఐదేళ్లలో అక్రమ కట్టడాలు చేపట్టారని ఆరోపించారు. రికార్డులు ఉంటే తీసుకుని రావాలని తెలిపారు. లేకుంటే ఏ పార్టీవారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.