కృష్ణా జిల్లాకు చెందిన చెస్ ప్లేయర్ కోనేరు హంపి 2024 మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. ఆదివారం న్యూయార్క్ (USA)లో జరిగిన ఫైనల్లో హంపి, ఇండోనేషియాకు చెందిన ఇరీన్ సుకందార్పై విజయం సాధించి టైటిల్ దక్కించుకుంది. 2019లో కూడా ఈ ఛాంపియన్షిప్ గెలిచిన హంపి, రెండోసారి ఈ ఘనత సాధించింది.