PLD: యడ్లపాడు మండలంలోని కొండవీడు, స్పైసస్ పార్క్ సబ్ స్టేషన్లో మరమ్మత్తుల నేపథ్యంలో సోమవారం పలు గ్రామాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్ ఆదివారం తెలిపారు. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పుట్టకోట, కొత్తపాలెం, కోట, సొలస, లింగారావుపాలెం, చెంగిజ్ ఖాన్ పేట్, వంకాయలపాడు గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.