AKP: మాడుగుల మండలం ఎం.కోడూరు శ్రీమోదకొండమ్మ అమ్మవారికి గ్రామానికి చెందిన కొట్టాపు కొండలరావు, రమణబాబు వరాహమూర్తి, బైలపూడి వెంకటరావులు ఆదివారం అరకేజీ వెండిని అందజేశారు. ఈ వెండిని ఆలయ ఛైర్మన్, సర్పంచ్ గొల్లవిల్లి సంజీవరావుకు అందజేయడం జరిగింది. అమ్మవారికి వెండిని బహుకరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆలయ ఛైర్మన్ అన్నారు.