KRNL: శ్రీశైల జలాశయం పరిధిలోని తెలంగాణ ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 0.338 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని చేశారు. ఇందుకోసం జలాశయం నుంచి 715 క్యూసెక్కుల నీటిని వినియోగించారు. అలాగే మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2400 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 1500 క్యూసెక్కులు,హెచ్ఎన్ఎస్ఎస్కు 1631 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.