ELR: నూజివీడులోని శ్రీ దత్త పీఠంలో శ్రీ గణపతి సచ్చితానంద స్వామివారిని రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రాష్ట్రంలోని కొన్ని విషయాలను మంత్రి స్వామి వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.