రష్యాకు చెందిన కార్గో షిప్ ఇటీవల మిడిటెర్రానియన్ సముద్రంలో మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన గురించి నౌక యజమాని స్పందించారు. నౌక మునిగే ముందు పలు భారీ పేలుళ్లు సంభవించాయని చెప్పారు. పేలుళ్ల దాటికి ఇంజన్ రూం ధ్వంసం అయిందని, దీంతో పరిస్థితి చేజారిపోయిందని అన్నారు. అయితే ఇది ఉగ్రచర్యేనని ఆరోపించారు.