NDL: ‘నా బనగానపల్లె- నా ఆరోగ్యం’ పేరిట ఈనెల 28న మెగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి తెలిపారు. బనగానపల్లె టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి ఈ మెగా ర్యాలీ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ‘రండి.. హరిత సైనికులై ర్యాలీకి కదలిరండి.. బనగానపల్లెను ప్లాస్టిక్ నుంచి విముక్తి చేద్దాం!’ అన్నారు.