MNCL: మందమర్రి మండలం మేడారం గ్రామం మహా రెస్ట్రో ఎదురుగా శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని బైకు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద విషయాన్ని పోలీసులకు చేరవేసినట్లు గ్రామస్థులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.