బ్రెజిల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 38కి చేరింది. మినాస్ గెరియిస్ నగరంలో హైవేపై ట్రక్కును బస్సు ఢీకొట్టింది. రన్నింగ్లో ఉండగా బస్సు టైర్ ఊడిపోయింది. దీంతో అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. బస్సులో మంటలు చెలరేగటంతో 38 మంది మృతిచెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సావో పాలో ప్రాంతం నుంచి 45 మందితో బస్సు వెళ్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.