BPT: కర్లపాలెం మండలం చింతాయపాలెంలో శనివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామంలోని నడింపాలెం రామాలయం సమీపంలో సాయంత్రం మంటలు వ్యాపించి పూరిపాక దగ్ధమైందన్నారు. వెంటనే స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికి ప్రయేజనం లేకపోయింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.