NTR: తిరువూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ ఆధ్వర్యంలో శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏ. కొండూరు, తిరువూరు, గంపలగూడెం మండలాల్లో 57 తెలంగాణ మద్యం బాటిల్స్, 20 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు SI M. రామ శేషయ్య తెలిపారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి తిరువూరు స్టేషన్కు తరలించినట్లు తెలిపారు.