NLR: నాయుడుపేట మండలం తిమ్మాజి కండ్రిగ గ్రామ సమీపంలో రహదారిపై శనివారం రాత్రి ఆటోను ఓ బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న మనోజ్ కుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మేనకూరు వైపు నుంచి బైక్‌లో వస్తున్న మనోజ్ కుమార్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొన్నాడు. సీఐ బాబీ ఘటనకు వెళ్లి పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.