ASR: మట్లపాడుకు చెందిన మొరం సాయి దొర (6) అనే ఆరేళ్ల బాలుడు పాముకాటుకి గురై శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఆరుబయట ఆడుకుంటున్న బాలుడికి పాముకాటుకు గురై శరీరం రంగు మారుతుండటంతో బాలుడు తండ్రి తమన్న దొర ఎల్లవరం పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అడ్డతీగల సీహెచ్సీ వైద్యులకు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.