వదిలేసి వెళ్లిన కారులో రూ.10కోట్ల నగదు, 52 కేజీల బంగారం దొరికన ఘటన మధ్యప్రదేశ్లో భోపాల్లో చోటు చేసుకుంది. అటవీ మార్గంలో భారీగా బంగారాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ ఇన్నోవా కారు మాజీ కానిస్టేబుల్ గౌరవ్ శర్మ అనే వ్యక్తిదని గుర్తించారు. బంగారం, డబ్బు కూడా అతనిదేనని అనుమానిస్తున్నారు.