MDK: రామాయంపేట మున్సిపల్ పరిధిలోని కేసీఆర్ కాలనీలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభం నుంచి బ్లాక్ లోనికి వచ్చే మెన్ సర్వీస్ వైర్లు అంటుకోవడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. కాలనీలో ఉన్న 12వ బ్లాకులో కొన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో మంటలు చెలరేగి పలు గృహోపకరణాలు దగ్ధమయ్యాయి.