MHBD: కురవి మండలం గుండ్రాతిమడుగు రైతువేదిక క్లస్టర్ ఏఈవో కళ్యాణ్ సస్పెన్షన్కు గురయ్యారు. ఇటీవల ఆయన ముగ్గురు రైతుల బీమా డబ్బులు తన ఖాతాలోకి మళ్లించి మోసం చేశాడని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు విచారణ చేపట్టగా నేరం రుజువైంది. ఈ క్రమంలో ఏఈవోను విధుల నుంచి తొలగిస్తున్నట్టు గురువారం వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి వెల్లడించారు.