తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు వరుసగా మూడో రోజు తగ్గాయి. నిన్నటితో పోల్చితే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,400గా ఉంది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 తగ్గి రూ.76,860గా నమోదైంది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. ఈ మేరకు కిలో వెండి ధర రూ.1000 తగ్గడంతో రూ.98వేలుగా కొనసాగుతోంది.