నంద్యాలలో అక్రమంగా కుందూ మొరుసును తరలిస్తున్నారు. అక్రమార్కులకు కుందూ మొరుసు కాసుల వర్షం కురిపిస్తుంది. ఉదయం నుంచి రాత్రివరకు కుందూలో యదేచ్చగా తవ్వకాలు జరుపుతున్నారని పీవీ నగర్ వాసులు తెలిపారు. రోజు 20 ట్రాక్టర్లలో మొరుసు తోలుకొని సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ మొరుసు ధర రూ.1,600 నుంచి రూ.2,000 వేల వరకు అమ్ముతున్నారు.