NLG: ఈ నెల 30న టైలరింగ్ కోర్సులో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ ఎ.అనిత తెలిపారు. పదో తరగతి పాస్, ఫెయిల్ అయిన మహిళలు అప్లై చేసుకోవాలన్నారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉండి యోగ్యతా పత్రం కలిగిన వారు అర్హులన్నారు. టైలరింగ్‌లో 30 సీట్లు ఉన్నాయని, శిక్షణ 45 రోజులు ఉంటుందని చెప్పారు.