TG: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోయాయి. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6.6, అల్గోయి 7.6, కంగ్టి 8.2.. సిద్దిపేట పోతారెడ్డిపేట 8.9, నంగునూరు 9.4, మిర్దొడ్డి 10 డిగ్రీలు రికార్డైంది. మెదక్ జిల్లా దామరంచలో 9.7, కొత్తపేట 10.2, హైదరాబాద్‌లో 11.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.