జమ్మూకశ్మీర్ కథువాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఓ ఇంట్లో మంటలు చెలరేగటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఇంట్లో 10 మంది ఉన్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదం కారణంగా దట్టమైన పొగ అలుముకోవటంతో వారు మృతి చెందినట్లు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.