GDWL: జిల్లా కోర్టు నిర్మాణ స్థల విషయంలో ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో న్యాయవాదులు నేటి నుంచి రిలే దీక్ష చేపడతామని బార్ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు రఘురామిరెడ్డి, ఖాజామైనుద్దీన్ తెలిపారు. గద్వాల DSP సత్యనారాయణను కలిసి దీక్ష చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీక్షకు ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలన్నారు.