AP: మధ్యాహ్న భోజనం పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది. ప్రాంతాల వారీగా విద్యార్థుల మెనూలో మార్పులు చేయనుంది. స్థానికంగా విద్యార్థుల ఆహారపు అలవాట్ల ఆధారంగా మెనూని రూపొందించనుంది. రాష్ట్రాన్ని 4 జోన్లుగా విభజించి విద్యార్థులకు మెనూ రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించింది.