లోక్సభలో వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లును ఇవాళ కేంద్రం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తమ MPలను కాంగ్రెస్ అప్రమత్తం చేసింది. ఈ మేరకు లోక్సభ MPలకు విప్ జారీ చేసింది. ఇవాళ సభకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ బిల్లు లోక్సభలో ఆమోదం పొందాలంటే 361 మంది సభ్యులు ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ, BJPకి దిగువ సభలో 293 మంది MPల బలం మాత్రమే ఉంది. కానీ, బిల్లు పాస్ అవుతుందని బీజేపీ ధీమాగా ఉంది.