W.G: నరసాపురం పట్టణంలోని జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఆటోను కారు ఢీకొట్టింది. పాలకొల్లు నుంచి నరసాపురం వైపు వస్తున్న కారు నరసాపురం నుంచి పాలకొల్లు వైపు వెళ్తున్న ఆటోను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది.