బోర్డర్-గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో భారత్ గెలుపొందగా.. రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమం అయింది. డిసెంబరు 14 నుంచి గబ్బా స్టేడియంలో మూడో టెస్టు ప్రారంభంకానుంది. అయితే గబ్బా టెస్టులో ఏ జట్టు గెలిస్తే ఆ టీమ్ సిరీస్ను కైవసం చేసుకుంటుందని భావిస్తున్నానని భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అన్నారు. ఇందులో తనకేలాంటి సందేహం లేదన్నారు.