కర్నూలు: పగిడ్యాల మండలంలోని ముచ్చు మర్రి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త చావోలు సుంకన్న ఆనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి బుధవారం గ్రామానికి చేరుకొని, సుంకన్న పార్థివదేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.