బెంగళూరుకు చెందిన టెకీ ఆత్యహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. భార్య వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నట్లు అతుల్ సుభాష్ రాసిన లేఖ వైరల్ అవుతోంది. ఈ క్రమంలో అతుల్ భార్య నిఖితా సింఘానియా స్పందించింది. అత్తింటి వారు తనను గొడ్డులా చూసేవారంటూ ఆరోపించింది. తన అత్త కట్నం కోసం వేధించినట్లు పేర్కొంది. వారి అత్తగారి వేధింపుల కారణంగా.. తన తండ్రి ఆరోగ్యం దెబ్బతిని 2019లో మరణించారని తెలిపింది.