NRPT: పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులు వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ బెన్ శాలం తహసీల్దార్లను ఆదేశించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్లో జిల్లాలోని తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైతే క్షేత్ర స్థాయికి వెళ్లి విచారణ జరపాలని సూచించారు.