TG: నటుడు మోహన్ బాబుకు చెందిన హైదరాబాద్లోని ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. మనోజ్ సామగ్రిని తరలించేందుకు వాహనాలు సిద్ధంగా ఉంచారు. మూడు వాహనాల్లో సామగ్రిని తరలించనున్నారు. ఎలాంటి గొడవలకు తావులేకుండా ముందస్తుగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మనోజ్ తన ఇంటికి రావద్దని మోహన్ బాబు అన్నట్లు తెలుస్తుంది.