TG: వికారాబాద్ తాండూరులోని గిరిజన గురుకుల పాఠశాల హాస్టల్లో విద్యార్థినులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. విగ్రహాలపై ఉన్న ధ్యాస విద్యార్థులపై లేదని మండిపడ్డారు. సొంత జిల్లాలోని పాఠశాలలనూ CM నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులు చనిపోతున్నా.. మొద్దు నిద్ర వీడకపోవడం దుర్మార్గమన్నారు. CM నిర్లక్ష్యం వల్ల ఇంకెంతమంది ప్రాణాలు పోవాలోనని ధ్వజమెత్తారు.