AP: అల్లుఅర్జున్ అభిమానులకు పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని ఓ థియేటర్ ఉచితంగా టికెట్లు ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అన్ని చోట్లా రూ.వేలల్లో టికెట్లను విక్రయించగా.. జీ7 మినర్వా థియేటర్ ఉచితంగా టికెట్లు ఇచ్చింది. ఏకంగా బుక్ మై షోలోనే ఫ్రీ టికెట్లను పంపిణీ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.