పుష్ప-2 సినిమా విడుదల నేపథ్యంలో అల్లుఅర్జున్ కుమారుడు అయాన్ రాసిన లెటర్ వైరల్ అవుతోంది. ‘ఈ రోజు ప్రపంచంలోనే ఒక గొప్ప నటుడి మూవీ రిలీజ్ అయింది. నాకు చాలా ప్రత్యేకం. పుష్ప-2 కేవలం సినిమా మాత్రమే కాదు.. సినిమా పట్ల నీకున్న ప్రేమను తెలియజేస్తుంది. నా జీవితంలో నువ్వే ఎప్పటికీ హీరో. నీకున్న కోట్లాది అభిమానుల్లో నేనూ ఒకడిని’ అంటూ రాసిన అయాన్ లేఖను అల్లు అర్జున్ ట్విట్టర్లో పోస్టు చేసి.. రిప్లై ఇచ్చాడు.