ELR: సత్రంపాడు ఐటీఐ కళాశాల వద్ద నిరుద్యోగ యువకులకు స్వల్పకాలిక శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రిన్సిపల్ రజిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8లోపు అప్లికేషన్ను స్వీకరిస్తామన్నారు. 30 సంవత్సరాలలోపు వారు పదవ తరగతి ఆపై చదువుకుని ఖాళీగా ఉన్న అభ్యర్థులు అర్హులని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.