AP: పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) క్లారిటీ ఇచ్చింది. ప్రాజెక్టులో రెండు దశల ప్రస్తావన లేదని తేల్చి చెప్పింది. ఆర్టీఐ కార్యకర్త ఇనుగంటి రవికుమార్ ఆర్టీఐ కింద 14 అంశాలపై అడిగిన సమాచారానికి పీపీఏ సమాధానం ఇచ్చింది. 2021-23 మధ్య చెల్లింపులను రెండుగా చేయాలని అప్పటి వైసీపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్లు తెలిపింది. దీంతో ప్రాజెక్టులో తొలి ఫేజ్ అనేది తెరపైకి వచ్చినట్లు పీపీఏ వివరణ ఇచ్చింది.